పత్తికొండ మండలం దూదేకొండలో ఇంటిగ్రేటెడ్ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం నవంబర్ నెల చివరి నాటికి పూర్తవ్వాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ తో పాటు పరిశీలించారు. ప్రస్తుతానికి బేస్మెంట్ లెవెల్, పిల్లర్ స్థాయి వరకు పూర్తయ్యాయి. సివిల్ స్ట్రక్చర్ పనులు ఆగస్టు నెలలో, మిషనరీతో సహా యూనిట్ నవంబర్‌లో ప్రారంభం అవుతుందని తెలిపారు.