పత్తికొండ: రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ అధినేత రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని పత్తికొండ నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గురువారం పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చానల్‌లో మహిళలపై ప్రసారమైన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరంగా, మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆమె ఆరోపించారు. మీడియా సంస్థలు మార్గదర్శకంగా ఉండాలని, ఇలాంటి అసభ్యకర ప్రసారాలు తగదని, ఇవి మహిళల మనోభావాలను దెబ్బతీస్తాయని శ్రీదేవమ్మ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్