కర్నూలు జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వస్తున్న విబి-జి రామ్ జీపై అవగాహన కోసం ఈ నెల 5న గ్రామసభలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఈ సభలకు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ఉపాధి కూలీలు, మహిళలు, ఎస్సీ-ఎస్టీ, బలహీన వర్గాల కుటుంబాలు హాజరయ్యేలా చూడాలని ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య ఏపీడీలు, ఏపీవోలను ఆదేశించారు.