వెల్దుర్తిలో అంగన్వాడీల అరెస్టు ఖండిస్తూ అంబేద్కర్ కు వినతి

వెల్దుర్తిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం ఆందోళన చేపట్టారు. విజయవాడ మహాధర్నాలో పాల్గొన్న అంగన్వాడీలను రాత్రి సమయంలో అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ బస్టాండ్ సర్కిల్‌లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కనీస వేతనం రూ. 26 వేలు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, డిమాండ్లపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్