కర్నూలు జిల్లా పత్తికొండ-దూదేకొండ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతన్ని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అతన్ని ఎవరైనా గుర్తిస్తే వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.