పత్తికొండ మండలం పందికోన రిజర్వాయర్ లో పెండింగ్ పనులను పూర్తి చేయడానికి రూ. 210 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం పందికోన రిజర్వాయర్ ను పరిశీలించారు. 40, 000 ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో రిజర్వాయర్ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆర్జీడీఎస్, వేదవతి ప్రాజెక్టు పనులు కూడా కొనసాగించాలని తెలిపారు.