కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీవో అసిస్టెంట్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కెఎండీ ఆవేశ్ శుక్రవారం పత్తికొండలో వాహన తనిఖీ సమయంలో డ్రైవర్ చరణ్ రెడ్డితో ఘర్షణ పడ్డారు. పత్రాలు లేవని నిరూపించిన వెంటనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశ్ డ్రైవర్ పై దాడి చేశాడని, చరణ్ రెడ్డి దుర్భాషలాడాడని ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. గతంలోనూ ఆవేశ్ న్యాయవాదులతో ఘర్షణ పడిన ఘటనలు ఉన్నాయి.