సూదేపల్లి: రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

వెల్దుర్తి మండలంలోని సూదేపల్లి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. సుమారు 60 ఏళ్లు పైబడినట్లుగా అంచనా వేస్తున్న మృతుడి వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లభించలేదని పోలీసులు తెలిపారు. గ్రామస్థుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెల్దుర్తి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై నరేష్ కుమార్ కోరారు.

సంబంధిత పోస్ట్