తుగ్గలి మండల సీపీఐ కార్యదర్శిగా సుల్తాన్ శనివారం రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా సూరా రెడ్డి హనుమేశులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సుల్తాన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మరోసారి అవకాశం ఇచ్చిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎర్రజెండా పేద ప్రజల అండగా నిలుస్తుందని, సమస్యలపై పోరాడతామని చెప్పారు.