పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వసుందర (61) గురువారం అనారోగ్యంతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన ఆమె ఇటీవల పదోన్నతి పొందిన తర్వాత ఈ కేంద్రంలో బాధ్యతలు చేపట్టారు. వసుందర మృతిపట్ల వైద్యులు, సిబ్బంది సంతాపం తెలిపారు.