తుగ్గలి: రైల్వే ట్రాక్‌ వద్ద మృతుడి ఆచూకీ లభ్యం

డోన్ రైల్వే పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం, చెన్నంపల్లి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన విద్యుత్తు స్తంభానికి లుంగీతో ఉరేసుకుని మృతిచెందిన యువకుడిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీ అనూప్ మాలిక్ (35)గా గుర్తించారు. ఆర్ఎస్ పెండేకల్లు–గుత్తి రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్ పనుల కోసం అతడు ఇక్కడికి వచ్చాడు. కుటుంబ కలహాల కారణంగా భార్యతో విభేదాలు ఏర్పడి విడిగా ఉంటున్నట్లు సమాచారం. భార్య దూరంగా ఉండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్