తుగ్గలి: కాలేజీలు ప్రైవేట్ పరం చేయవద్దంటూ కోటి సంతకాల సేకరణ

తుగ్గలిలోని ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్సీపీ, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పర్వం చేయవద్దంటూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి కుమారుడు, వైసీపీ రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి, ఐటీ విభాగ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తోందని, ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్