తుగ్గలి: గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ రామాంజనేయులు మృతి

తుగ్గలి మండలం జీ. ఎర్రగుడి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ వడ్ల రామాంజనేయులు (55) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రామాంజనేయులు గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించేవారని స్థానిక నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు ఎర్రగుడి రామచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్ యాదవ్, జెడ్పీటీసీ పులికొండ నాయక్, మాజీ జెడ్పీటీసీ నారాయణ నాయక్ తదితరులు సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్