తుగ్గలి: పేకాటరాయుళ్ల అరెస్ట్.. 10 మందిపై కేసు నమోదు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పేకాట ఆడుతున్న 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఎస్సై నరేష్ వెల్లడించిన వివరాల ప్రకారం, రామకొండ గ్రామ శివారులో ఏడుగురిని, మారెల్ల గ్రామ శివారులో మరో ముగ్గురిని పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం రూ. 7,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్