సీఎం చంద్రబాబు తోనే సుపరిపాలన సాధ్యమని టిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రాముడు మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, శ్రీనివాస్ లు అన్నారు.గురువారం మండలంలోని ఎద్దుల దొడ్డి గ్రామంలో ఆ యన సుపరిపాలనలో తొలి అడు గు కార్యక్రమాన్ని నిర్వహించారు. మారెళ్ళ సొసైటీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ విజయ్, కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంచుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.