తుగ్గలి: ఎంఆర్పీఎస్ నేత హత్యను ఖండించిన ఎంపీ నాగరాజు

తుగ్గలి మండలం బొందిమడుగులో ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ హత్యను ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఢిల్లీలో ఉన్న ఆయన, ఘటనపై పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రమేష్ హత్య అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన, హత్యా రాజకీయాలను ప్రభుత్వం ప్రోత్సహించదని, తప్పిదులకు చట్టప్రకారం కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్