ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని కాపాడిన తుగ్గలి పోలీసులు

శుక్రవారం తుగ్గలి మండల పరిధిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అదే సమయంలో రైలు వస్తుండటంతో అప్రమత్తమైన పోలీసులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చి రైలును నిలిపివేయించారు. అనంతరం ట్రాక్‌పై ఉన్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్