తుగ్గలి: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

తుగ్గలి మండలంలోని పెండేకల్–గుత్తి రైల్వే లైన్‌పై రాంపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, గుర్తింపు కోసం ప్రయత్నాలు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియరాకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్