వెల్దుర్తి: ఐరన్ ఓర్ అక్రమ మైనింగ్ నిలిపివేయాలి: రైతు సంఘం

ఓర్వకల్లు–వెల్దుర్తి మండలాల మధ్య ప్రాంతంలో జరుగుతున్న ఐరన్ ఓర్ అక్రమ మైనింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన రైతు సంఘం ప్రతినిధి బృందం, ప్రభుత్వ అనుమతులు లేకుండా కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించింది. రాత్రి వేళల్లో తవ్వకాలు నిర్వహించి ఐరన్ ఓర్‌ను తరలిస్తున్నట్లు గుర్తించామని, గనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. అక్రమ మైనింగ్ కొనసాగితే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్