వెల్దుర్తి: షాపింగ్ కాంప్లెక్స్‌లో పల్సర్ బైక్ చోరీ

వెల్దుర్తి స్థానిక పంచాయతీ కార్యాలయం సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో నిలిపి ఉంచిన పల్సర్ బైక్ చోరీకి గురైంది. కృష్ణగిరి మండలం తొగర్చేడుకు చెందిన శ్రీను అనే యువకుడు శుక్రవారం తన బైక్‌ను కాంప్లెక్స్‌లోని మొబైల్ షాపు వద్ద నిలిపి పనికి వెళ్ళాడు. మధ్యాహ్నం ఓ యువకుడు బైక్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సాయంత్రం బైక్ కనిపించకపోవడంతో బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్