టోల్ ప్లాజా ప్రమాదంలో గాయపడిన కార్మిక నాయకుడికి పరామర్శ

క్రిష్ణగిరి మండలం అమకతాడు టోల్ ప్లాజాలో జరిగిన ప్రమాదంలో గాయపడిన టోల్ ప్లాజా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఆర్‌కేవీ రాజును సీఐటీయూ నాయకులు ఆదివారం పరామర్శించారు. కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజును సీఐటీయూ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి టి. శివరాం, యూనియన్ నాయకులు కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విధులు నిర్వహిస్తుండగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ టోల్ బూత్‌ను ఢీకొట్టడంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయని, ఎడమ కాలు విరిగిందని, అయితే ప్రాణాపాయం తప్పిందని నాయకులు తెలిపారు. కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్