ఆశ వర్కర్లకు సంక్షేమ పథకాలు: సిఐటియు డిమాండ్

ఆశ వర్కర్లకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, ఆశల నియామకం ప్రభుత్వమే చేపట్టాలని సీఐటీయూ పత్తికొండ మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర డిమాండ్ చేశారు. ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆశలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పత్తికొండ మండలం పుచ్చకాయల పిఎస్ డాక్టర్ రాఘవ నాయుడుకు ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు స్వాతి అధ్యక్షతన సమ్మె నోటీసును అందించారు. కేంద్ర ప్రభుత్వం స్కీం వర్కర్లకు సరిపడా బడ్జెట్ విడుదల చేయలేదని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్