తుగ్గలి మండలం కోతికొండకు చెందిన అలిగేరి చిన్న భీమక్క (50) ఈనెల 26న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను వెంటనే పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించగా, గురువారం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై తుగ్గలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ఓ జయన్న తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.