ఆస్తి కోసం మహిళ హత్య

ఆస్తి వివాదంలో మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హొళగుంద మండలం సులువాయికి చెందిన గాదిలింగప్ప తన 4.50 ఎకరాల భూమిని ఇద్దరు భార్యలకు పంచాలనుకున్నాడు. దీనికి అంగీకరించని మొదటి భార్య మల్లమ్మ, ఆమె కుమారులు రెండో భార్య ఎల్లమ్మను కొడవలితో నరికి చంపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్