2026లోనైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులపై కఠినమైన 29 చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, వీబీజీ రాంజీజీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం వంటి వాటిని వెనక్కి తీసుకోవాలని, కార్మికులకు మేలు జరిగేలా నూతన సంవత్సరం సాగాలని సీఐటీయూ మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర శనివారం పత్తికొండలో పేర్కొన్నారు. పత్తికొండలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.