జూన్ 4న తుగ్గలిలో వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమం

చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 4 నుంచి 12 వరకు "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. జూన్ 4న ఉదయం 10 గంటలకు తుగ్గలి మండల కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పాల్గొంటారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పార్టీ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్