మహానందిలో సంక్రాంతి ఉత్సవాల ఏర్పాట్లు

మహానంది దేవస్థానంలో ఈ నెల 14 నుంచి సంక్రాంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. భోగి పూజలు, సంక్రాంతి రోజున ప్రత్యేక అభిషేకాలు, తిరుమంజనం నిర్వహిస్తారు. కనుమ రోజున గోపూజ, పారువేట ఉత్సవం జరుగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్