ఆత్మకూరు: రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి

రైతులు పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలంలోని కరివేన, నల్లకాల్వ గ్రామాల్లో నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విచక్షణారహితంగా రసాయన ఎరువులు, మందులు వాడటం భూమికి నష్టం కలిగిస్తుందని, వాటి స్థానంలో సేంద్రియ ఎరువులు వినియోగించాలని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్