పాలకులు నిరంకుశ వైఖరిని విడనాడాలని సీపీఎం నేతలు యేసు రత్నం, రణధీర్ కోరారు. బుధవారం దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాలతో కలిసి నిరసన తెలిపారు. కార్మికులను బానిసలుగా మారుస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పని గంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.