కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చెప్పారు. గురువారం ఆత్మకూరు ఇందిరానగర్ కాలనీలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. కూటమి పాలనతో అన్ని వర్గాలకూ మేలు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.