కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని రహమత్ నగర్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి పర్యటించి కూటమి ప్రభుత్వ పాలనలో అమలువుతున్న సంక్షేమ పథకాల లబ్ది గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.