ఆత్మకూరు పట్టణంలోని ఎల్. వి ఫంక్షన్ హాల్ నందు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మీర్ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, మాజీ ఎంపీ పొచా బ్రహ్మానంద రెడ్డి లు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.