బనగానపల్లెలో శిశువు మృతి.. నిర్లక్ష్యంపై సీపీఐ ఆరోపణలు

బనగానపల్లెలోని సురేఖ మెటర్నిటీ, చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 8 నెలల శిశువు మృతి చెందిందని సీపీఐ మండల కార్యదర్శి శివయ్య ఆరోపించారు. జలుబు, దగ్గుతో ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, అనంతరం నంద్యాల ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి అనుమతులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్