బనగానపల్లె పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కాటసాని రామీ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీలు, బాండ్ల ప్రతులను దహనం చేస్తూ నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు అమలు కాలేదని వారు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, అమలు అయ్యే వరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని నేతలు తెలిపారు.