వెలుగోడు పశువర్ధక శాఖ సహాయ సంచాలకులు డి వెంకటేశ్వర్లు సోమవారం బండి ఆత్మకూరు మండల పరిధిలో ఉన్న సింగవరం గ్రామంలోని పశువైద్యశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం తెల్లజాతి పశువులకు లంపి వ్యాధికి సంబంధించి వ్యాధి నిరోధక టీకాలను స్వయంగా వేశారు. లంపి వ్యాధి గురించి రైతులకు తగు సూచనలు చేశారు. చంటి వ్యాధి ఎక్కువగా తెల్ల పశువులలో వస్తుందని అన్నారు.