బండి ఆత్మకూరు ఎస్సై జగన్మోహన్ సంత జూటూరు జెడ్పిహెచ్ పాఠశాలలో గురువారం మత్తుపదార్థాల వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్‌ను నాశనం చేస్తాయనీ, సిగరెట్, మద్యం, గంజాయి వంటివి ఫ్యాషన్ కాదని, వాటిని దూరంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీసులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.