బండి ఆత్మకూరు: ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

బండి ఆత్మకూరు ఇంచార్జి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామకృష్ణ వేణి గురువారం ఉదయం గ్రామాన్ని సందర్శించారు. సంత గేటు, తాసిల్దార్ కార్యాలయం తదితర ప్రాంతాలలో పర్యటించారు. హరిత రాయబారులు ప్రతిరోజు పొడి చెత్తను తీసుకొని వెళ్తున్నారా లేదా అన్న విషయాలపై ఆమె ఆరా తీశారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్