విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం పని చేస్తూ ఉందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గురువారం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సూచనతో బండి ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.