నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఏకోడూరు సమీపంలో నారాయణపురం వద్ద ఆర్టీసీ బస్సు బైకు ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం నారాయణపురం వద్ద ఆర్టీసీ బస్సు బైకు ఢీకొన్న సంఘటనలో ఒకరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.