బండి ఆత్మకూరులో సజావుగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

బండి ఆత్మకూరు మండలంలో పదవ తరగతి పరీక్షలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగిశాయని మండల విద్యాశాఖ అధికారి యశోద తెలిపారు. గురువారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 18 మంది విద్యార్థులు హాజరు కాలేదని ఆమె పేర్కొన్నారు. మండలంలోని జడ్పీ హైస్కూల్‌లో 212 మందికి 204 మంది, ఏపీ మోడల్ స్కూల్‌లో 220 మందికి 213 మంది, సంత జూటూరు జడ్పీ హైస్కూల్‌లో 97 మందికి 94 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని ఎంఈఓ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్