నేడు సోమశిల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4, 5 తేదీల్లో సోమశిల ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, సోమశిల, బలపాల తిప్ప, జానాలగూడెం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సంగమేశ్వరం, సిద్ధేశ్వరం నుంచి సోమశిలకు కృష్ణానదిపై నడిచే మర బోట్ల సేవలను రెండు రోజుల పాటు నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్