శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సందడి

ఆదివారం సెలవుదినం కావడంతో శ్రీశైలం మహాక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబికమ్మల దర్శనం కోసం శీఘ్ర, ఉచిత దర్శనం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. దర్శనం అనంతరం పంచ మఠాలు, దేవస్థానం పరిసర పుణ్యక్షేత్రాలను సందర్శించిన భక్తులతో ఆ ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్