వేసవి సెలవుల కారణంగా శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శన క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా ఉచిత దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోందని భక్తులు తెలిపారు. ఈ రద్దీ వేసవి సెలవులు ముగిసే వరకు కొనసాగే అవకాశం ఉంది.