మార్గశిర మాసం ఆదివారం సందర్భంగా జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి, అమ్మవారి దర్శనం కోసం భారీ క్యూలైన్లలో నిలబడ్డారు. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శన మార్గాలు భక్తులతో నిండిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.