రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో పోతిరెడ్డిపాడులో గురువారం భారీ బహిరంగ సభ జరిగింది. ప్రాజెక్టు నిలిపివేత రాయలసీమకు అన్యాయమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి విమర్శించారు. ప్రజల భవిష్యత్తు కోసం ఐక్య పోరాటం అవసరమని ఆయన అన్నారు.