పసుపులలో రూ. 85 లక్షల అభివృద్ధి పనుల ప్రారంభం

బనగానపల్లె నియోజకవర్గంలోని పసుపుల గ్రామంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రూ. 85.20 లక్షల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. బీసీ కాలనీ, పాత పసుపులలో సీసీ రహదారులు, సైడ్ డ్రెయిన్లు, రోడ్డు విస్తరణ పనులతో పాటు, జల్ జీవన్ మిషన్ కింద రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన 60 కిలోలీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్‌ను ప్రారంభించి, గ్రామానికి సురక్షిత తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు. స్థానికులు, పార్టీ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్