మహానంది పుణ్యక్షేత్రంలో బస్సు నిలిపే స్థలం లేకపోవడంతో వాహనాలు రోడ్డుపైనే నిలుస్తున్నాయి. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భక్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి ప్రత్యేక బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని భక్తులు బుధవారం విజ్ఞప్తి చేశారు.