మహానంది క్షేత్రం ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తులు స్థానిక కోనేరులో స్నానాలు చేసి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామిని దర్శించుకున్నారు. భారీగా భక్తులు రావడంతో వసతి గృహాల కోసం వారు కొంత అసౌకర్యానికి లోనయ్యారు.