డోన్: రేపు దివ్యాంగులకు ఉచితంగా సహాయ పరికరాల పంపిణీ

నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులకు ఉచితంగా సహాయ పరికరాలు అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సహాయ సంచాలకులు ఫాతిమా గురువారం తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఈనెల 11న కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్