మహానందిలో రేపు ఐదు గంటల విద్యుత్ నిలిపివేత

మహానంది మండలంలోని మహానంది గ్రామంలో శుక్రవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. సబ్ స్టేషన్ నిర్వహణ పనులు, మహా శివరాత్రి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ గురువారం తెలిపింది. ప్రజలు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్